పంజాబ్, మొహాలీలోని గఢానా గ్రామంలో డ్రగ్స్ స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. సీఐఏ స్టాఫ్ బృందంపై కాల్పులు జరిపారు. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదనపు పోలీసు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
0 Comments