తమిళనాడులో బీజేపీకి గట్టి దెబ్బ కొట్టిన అన్నామలై : పది గంటల్లో పది లక్షల మంది చేరిక

మిళనాడులో బీజేపీకి అన్నామలై గట్టి దెబ్బే కొట్టారు. అన్నామలైకు మద్దతు గా కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. అటు అన్నామలై ప్రకటించిన ఉద్యమంలో భాగస్వాములు అయ్యేందుకు పది గంటల్లో పది లక్షల మంది చేరారు. అన్నామలై ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారారు. బీజేపీకి రాజీనామా తరువాత తాజాగా అన్నామలై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. కొత్త ఉద్యమం చేయనున్నట్లు వెల్లడించారు. అన్నామలైకు మద్దతుగా పలువురు బీజేపీ నేతలు పార్టీకి రాజీనామా చేసారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌, రాష్ట్ర కార్యదర్శి సుమతీ వెంకటేశ్‌ కూడా బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఇది పార్టీలో అంతర్గత విభేదాలపై చర్చకు దారితీసింది. నాగరాజన్‌ ఢిల్లీ నుంచి వచ్చిన అన్నామలైను చెన్నై విమానాశ్రయంలో కలిసి మద్దతు ప్రకటించారు. రాజీనామా లేఖను త్వరలో పార్టీ అధిష్ఠానానికి పంపుతానని చెప్పారు. అన్నామలైని ఒక సాహసోపేతమైన, డైనమిక్ లీడర్‌గా అభివర్ణించిన నాగరాజన్ ఆయన ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇదే బాటలో మరికొందరు బీజేపీ నేతలు సిద్దం అవుతున్నారు. అన్నామలై రాజకీయ మోడల్‌కు ఊహించని విధంగా స్పందన కనిపిస్తోంది. అన్నామలై ప్రారంభించిన వి ద లీడర్స్‌ పోర్టల్‌లో 10 గంటల్లోనే 10 లక్షలమంది వాలంటీర్లుగా రిజిస్టర్‌ చేసుకున్నారు. సామాన్యులకు చేరువ అయ్యే విధంగా తమ రాజకీయం ఉంటుందని అన్నామలై ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్పూర్తిగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసారు. తమిళనాడులో సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా తన ఉద్యమం కొనసాగు తుందని వివరించారు. తమిళుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు అన్నామలై తీసుకునే భవిష్యత్ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం