Posts

Showing posts with the label One Million Join in Ten Hours

తమిళనాడులో బీజేపీకి గట్టి దెబ్బ కొట్టిన అన్నామలై : పది గంటల్లో పది లక్షల మంది చేరిక

Image
త మిళనాడులో బీజేపీకి అన్నామలై గట్టి దెబ్బే కొట్టారు. అన్నామలైకు మద్దతు గా కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. అటు అన్నామలై ప్రకటించిన ఉద్యమంలో భాగస్వాములు అయ్యేందుకు పది గంటల్లో పది లక్షల మంది చేరారు. అన్నామలై ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారారు. బీజేపీకి రాజీనామా తరువాత తాజాగా అన్నామలై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. కొత్త ఉద్యమం చేయనున్నట్లు వెల్లడించారు. అన్నామలైకు మద్దతుగా పలువురు బీజేపీ నేతలు పార్టీకి రాజీనామా చేసారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌, రాష్ట్ర కార్యదర్శి సుమతీ వెంకటేశ్‌ కూడా బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఇది పార్టీలో అంతర్గత విభేదాలపై చర్చకు దారితీసింది. నాగరాజన్‌ ఢిల్లీ నుంచి వచ్చిన అన్నామలైను చెన్నై విమానాశ్రయంలో కలిసి మద్దతు ప్రకటించారు. రాజీనామా లేఖను త్వరలో పార్టీ అధిష్ఠానానికి పంపుతానని చెప్పారు. అన్నామలైని ఒక సాహసోపేతమైన, డైనమిక్ లీడర్‌గా అభివర్ణించిన నాగరాజన్ ఆయన ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇదే బాటలో మరికొందరు బీజేపీ నేతలు సిద్దం అవుతున్నారు. అన్నామలై రాజకీయ మోడల్‌కు ఊహించని విధంగా స్పందన కనిపిస్తోంది. అన్నామలై ప...