చైనాలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసిన హువావే
చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో 'హువావే నోవా 16 ప్రో' , 'హువావే నోవా 16 అల్ట్రా' మోడళ్లను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. వీటితో పాటు స్టాండర్డ్ నోవా 16, నోవా 16జెడ్ మోడళ్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫోన్లలో అత్యంత శక్తివంతమైన కిరిన్ 9010ఎస్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ , నెక్స్ట్-లెవెల్ కెమెరా ఫీచర్లను అందించారు. హువావే నోవా 16 ప్రో మోడల్ బేస్ వేరియంట్ అయిన 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర సుమారు 54,000 రూపాయలుగా ఉంది. అలాగే ఇందులోనే 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 61,000 రూపాయలుగా , టాప్ ఎండ్ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 68,000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఫోన్ క్లియర్ బ్లూ, ఇరిడెసెంట్ పెర్ల్, స్కై వైట్ , స్టారీ నైట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. హువావే నోవా 16 అల్ట్రా మోడల్ ప్రారంభ ధర సుమారు 65,000 రూపాయలుగా ఉంది. దీని 512GB వేరియంట్ ధర సుమారు 72,000 రూపాయలు కాగా, అత్యధిక స్టోరేజ్ కలిగిన 1TB వేరియంట్ ధర సుమారు 81,000 రూపాయలుగా ఉంది. ఈ అల్ట్రా మోడల్ క్లియర్ బ్లూ, స్కై వైట్ , స్టారీ నైట్ బ్లాక్ రంగులలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. నోవా 16 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హార్మొనీ ఓఎస్ 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 1Hz నుండి 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.84-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ ఎల్టీపీーఓ డిస్‌ప్లేను అమర్చారు. దీనికి కున్లున్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. హువావే సొంత కిరిన్ 9010ఎస్ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ ఉంది. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 3.7x ఆప్టికల్ జూమ్ ఉన్న 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ మాక్రో లెన్స్ , రెడ్ మేపుల్ కలర్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 7,000mAh భారీ బ్యాటరీని అందించారు. వై-ఫై 7, బ్లూటూత్ 6, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు ధూళి, నీటి నుండి రక్షణ కోసం దీనికి ఐపీ65 రేటింగ్ ఇచ్చారు.
Comments
Post a Comment