Posts

Showing posts with the label Huawei Launches New Smartphone Series in China

చైనాలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసిన హువావే

Image
చై నాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో 'హువావే నోవా 16 ప్రో' , 'హువావే నోవా 16 అల్ట్రా' మోడళ్లను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. వీటితో పాటు స్టాండర్డ్ నోవా 16, నోవా 16జెడ్ మోడళ్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫోన్లలో అత్యంత శక్తివంతమైన కిరిన్ 9010ఎస్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ , నెక్స్ట్-లెవెల్ కెమెరా ఫీచర్లను అందించారు. హువావే నోవా 16 ప్రో మోడల్ బేస్ వేరియంట్ అయిన 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర సుమారు 54,000 రూపాయలుగా ఉంది. అలాగే ఇందులోనే 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 61,000 రూపాయలుగా , టాప్ ఎండ్ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 68,000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఫోన్ క్లియర్ బ్లూ, ఇరిడెసెంట్ పెర్ల్, స్కై వైట్ , స్టారీ నైట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. హువావే నోవా 16 అల్ట్రా మోడల్ ప్రారంభ ధర సుమారు 65,000 రూపాయలుగా ఉంది. దీని 512GB వేరియంట్ ధర సుమారు 72,000 రూపాయలు కాగా, అత్యధిక స్టోరేజ్ కలిగిన 1TB వేరియంట్ ధర సుమారు 81,000 రూపాయలుగా ఉంది. ఈ అల్ట్రా మోడల్ క్లియర్ బ్లూ, స్కై వైట్ , స్టారీ నైట్ బ్లాక్ రంగులలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. నోవా 16 ప్రో స్మార్...