OTT బెనిఫిట్స్‌ను సైలెంట్‌గా మార్చేసిన జియో, ఎయిర్‌టెల్ ?
జియో, ఎయిర్‌టెల్ తమ ప్లాన్లలోని OTT బెనిఫిట్స్‌ను సైలెంట్‌గా మార్చేశాయని ఏప్రిల్ 12న యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఇకపై పెద్ద టీవీ స్క్రీన్లపై హై-క్వాలిటీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసే అవకాశం కోల్పోతామేమోనని సబ్‌స్క్రైబర్లు ఆందోళన చెందుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్న ప్రీమియం ప్యాక్‌ల విషయంలో ఈ గందరగోళం నెలకొంది. గతంలో టీవీల్లో కూడా చూసే వీలుండగా, ఇప్పుడు కేవలం మొబైల్ ఫోన్లకే పరిమితం చేశారని యూజర్లు చెబుతున్నారు. యూజర్లను మరింత ఖరీదైన ప్రీమియం ప్లాన్ల వైపు మళ్లించేందుకే టెలికాం దిగ్గజాలు ఈ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. మెట్రో నగరాల్లోని ఫైబర్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఈ మార్పుతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో స్మార్ట్ టీవీల్లో యాప్స్ ఓపెన్ చేస్తే.. సడన్‌గా పెయిడ్ అప్‌గ్రేడ్స్ అడుగుతున్నాయని యూజర్లు వాపోతున్నారు. స్ట్రీమింగ్ యూజర్లను వర్గీకరించి, ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీ ప్లాన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి మీ ఫోన్‌లోని MyJio లేదా Airtel Thanks యాప్‌ను ఓపెన్ చేయండి. అందులో 'యాక్టివ్ ప్లాన్స్' సెక్షన్‌కు వెళ్లి మీ బెనిఫిట్స్ కేవలం మొబైల్‌కే పరిమితమయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి. టీవీలో మళ్లీ హై-డెఫినిషన్ స్ట్రీమింగ్ కావాలంటే కొంత అదనపు నెలవారీ రుసుము చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టగా వీఐ, బీఎస్ఎన్ఎల్ యూజర్లు కూడా వీటిని నిశితంగా గమనిస్తున్నారు. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
Comments
Post a Comment