Posts

Showing posts with the label Hotstar subscriptions

OTT బెనిఫిట్స్‌ను సైలెంట్‌గా మార్చేసిన జియో, ఎయిర్‌టెల్ ?

Image
జియో , ఎయిర్‌టెల్ తమ ప్లాన్లలోని OTT బెనిఫిట్స్‌ను సైలెంట్‌గా మార్చేశాయని ఏప్రిల్ 12న యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఇకపై పెద్ద టీవీ స్క్రీన్లపై హై-క్వాలిటీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసే అవకాశం కోల్పోతామేమోనని సబ్‌స్క్రైబర్లు ఆందోళన చెందుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్న ప్రీమియం ప్యాక్‌ల విషయంలో ఈ గందరగోళం నెలకొంది. గతంలో టీవీల్లో కూడా చూసే వీలుండగా, ఇప్పుడు కేవలం మొబైల్ ఫోన్లకే పరిమితం చేశారని యూజర్లు చెబుతున్నారు. యూజర్లను మరింత ఖరీదైన ప్రీమియం ప్లాన్ల వైపు మళ్లించేందుకే టెలికాం దిగ్గజాలు ఈ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. మెట్రో నగరాల్లోని ఫైబర్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఈ మార్పుతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో స్మార్ట్ టీవీల్లో యాప్స్ ఓపెన్ చేస్తే.. సడన్‌గా పెయిడ్ అప్‌గ్రేడ్స్ అడుగుతున్నాయని యూజర్లు వాపోతున్నారు. స్ట్రీమింగ్ యూజర్లను వర్గీకరించి, ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీ ప్లాన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి మీ ఫోన్‌లోని MyJio లేదా Airtel Thanks యాప్‌ను ఓపెన్ చేయండి. అం...