'క్లిక్స్ కమ్యూనికేటర్' స్మార్ట్‌ఫోన్ !


ఫోన్ల కోసం ఫిజికల్ కీబోర్డ్ కేసులను తయారు చేసి పాపులర్ అయిన క్లిక్స్ సంస్థ ఇప్పుడు నేరుగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌లను  రూపొందించింది. ఇది ముఖ్యంగా “కమ్యూనికేషన్” కోసం తయారు చేయబడిన పరికరం. ఈ ఫోన్ చూడటానికి అచ్చం పాత బ్లాక్‌బెర్రీలా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో స్క్రీన్ కింద పూర్తి స్థాయిలో QWERTY ఫిజికల్ కీబోర్డ్ ఉంటుంది. ఇది 4.03 అంగుళాల చిన్న OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. నేటి భారీ ఫోన్ల మధ్య ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. ఈ కీబోర్డ్ కేవలం టైపింగ్‌కే కాదు, టచ్-సెన్సిటివ్ ఫీచర్‌తో వస్తుంది. అంటే మీరు కీబోర్డ్ మీద వేలితో స్క్రోల్ చేస్తూ వెబ్ పేజీలు లేదా మెసేజ్‌లు చదువుకోవచ్చు. ఫోన్ సైడ్‌లో ఒక ప్రత్యేక బటన్ ఉంటుంది. దీన్ని నొక్కి పట్టుకుని వాయిస్ మెసేజ్‌లు పంపడం లేదా మీటింగ్‌లను ట్రాన్స్‌క్రిప్ట్ (మాటలను రాతగా మార్చడం) చేయవచ్చు. దీనికి రంగులు మారే సిగ్నల్ ఎల్‌ఈడీ కూడా ఉంది, ఇది నోటిఫికేషన్లను బట్టి మారుతుంటుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో పనిచేస్తుంది. 256GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా , ముందు వైపు 24MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4,000mAh బ్యాటరీతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5G సపోర్ట్, ఫిజికల్ సిమ్ , ఈ-సిమ్ సదుపాయాలు ఉన్నాయి. క్లిక్స్ కమ్యూనికేటర్ ప్రారంభ ధర $499 (సుమారు రూ. 41,500) గా నిర్ణయించారు. అయితే ఫిబ్రవరి 27 లోపు బుక్ చేసుకున్న వారికి $100 తగ్గింపుతో $399 (సుమారు రూ. 33,000) కే లభిస్తుంది. ఇది స్మోక్, క్లోవర్ , ఆనిక్స్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేయకుండా, కేవలం మెసేజింగ్, ఈమెయిల్స్ , పనుల మీద దృష్టి పెట్టాలనుకునే వారికి ఇది ఒక “సెకండరీ ఫోన్”గా అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. “మెసేజింగ్ కోసం కిండిల్” లాంటి పరికరం ఇది అని క్లిక్స్ సంస్థ అభివర్ణించింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం