ఫిబ్రవరిలో వివో ఎక్స్ 200 టీ విడుదల ?


వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ 200 టీ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కెమెరా సెటప్, ఈ ఫోన్ డిజైన్ వివరాలు తెలియ వస్తున్నాయి. కానీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ కెమెరా సెటప్ ZEISS ఆప్టిక్స్ తో కలిగి ఉంటుంది. ఇందులో మూడు బిగ్ సెన్సార్లు మరియు ఒఇక టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ వివరాలు ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ను చూస్తే మనకు అర్థం అయ్యే ఫీచర్స్. వివో ఈ అప్ కమింగ్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9400+ తో లాంచ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో 12 జీబీ LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ లో 50MP Sony LYT-702 ప్రైమరీ (OIS), 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ మరియు 50MP Sony LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్లు ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియో సపోర్ట్, AI కెమెరా ఫీచర్లు మరియు వివో ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 6,200 mAh పెద్ద బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం