కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చలు !


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. మొదట కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సోనియా గాంధీకి 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌'ను అందజేశారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమావేశాల్లో చర్చించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కలిసి 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌'ను ఆమెకు అందజేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' వివరాలను ముఖ్యమంత్రి ఆమెకు వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి తెలియజేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో మొత్తం 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లు ఏర్పాటు చేయనున్నట్లు, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ల నిర్మాణం ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు సుమారు రూ. 30 వేల కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. అలాగే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలిపారు. అంతేకాక, వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా అదనపు విద్యా సంస్థలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. రాష్ట్రానికి 9 కేంద్రీయ విద్యాలయాలను 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇతర వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం