Posts

Showing posts with the label Presents 'Telangana Rising 2047 Vision Document' to Sonia Gandhi

కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చలు !

Image
తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. మొదట కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సోనియా గాంధీకి 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌'ను అందజేశారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమావేశాల్లో చర్చించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కలిసి 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌'ను ఆమెకు అందజేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' వివరాలను ముఖ్యమంత్రి ఆమెకు వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న...