50 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద చెక్కులు అందజేసిన భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం యూపీఎస్సీ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 50 మందికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సివిల్ సర్వెంట్స్ గా అవకాశం దక్కించుకునే వారు సమాజానికి జవాబుదారీగా ఉండాలని, ప్రస్తుతం మీరు అందుకుంటున్న ప్రోత్సాహక చెక్కులు ప్రజలు కడుతున్న పన్నులతో వచ్చినవని పేర్కొన్నారు. ప్రజా జీవితాన్ని మార్చగలిగే, తెలంగాణ బలాన్ని ప్రతిభను ప్రతిబింబించేలా మీ విజయం ఉండాలని అభ్యర్థులకు సూచించారు. ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్ పైన దృష్టి సారించడం కోసం ఈ పథకం అందిస్తున్నామని సింగరేణి సిఎండి ఎన్ బలరాం పేర్కొన్నారు. యువత సివిల్ సర్వీసెస్ కలలు సాకారం చేసుకోవడానికి ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ ఇంటర్వ్యూ దశకు చేరిన అభ్యర్థులకు ఆర్థిక భారం లేకుండా చేసేలా, అభ్యర్థులకు ఆర్థికంగా, అకాడమిక్ గా మద్దతునిస్తూ, ఇంటర్వ్యూలు ఫేస్ చేయడానికి సిద్ధం చేసేలా భావించిన ప్రభుత్వం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి ఎంపికైన ప్రతి అభ్యర్థికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఎంపికైతే, అంతమందికి కూడా ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంతో గత సంవత్సర 20మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ దశకు చేరుకొని ప్రోత్సాహ నగదును అందుకున్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య 50కి చేరింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం, అభ్యర్థుల కోసం సీనియర్ అధికారులతో కూడిన ఒక ప్రత్యేకబోర్డు సమగ్ర మార్గనిర్దేశం చేస్తూ, వారికి డైరెక్షన్స్ ఇస్తుంది. ఢిల్లీలో ఇంటర్వ్యూ సమయంలో వసతితో పాటు పూర్తిగా సహాయ సహకారాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది.
Comments
Post a Comment