50 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద చెక్కులు అందజేసిన భట్టి విక్రమార్క
తె లంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం యూపీఎస్సీ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 50 మందికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సివిల్ సర్వెంట్స్ గా అవకాశం దక్కించుకునే వారు సమాజానికి జవాబుదారీగా ఉండాలని, ప్రస్తుతం మీరు అందుకుంటున్న ప్రోత్సాహక చెక్కులు ప్రజలు కడుతున్న పన్నులతో వచ్చినవని పేర్కొన్నారు. ప్రజా జీవితాన్ని మార్చగలిగే, తెలంగాణ బలాన్ని ప్రతిభను ప్రతిబింబించేలా మీ విజయం ఉండాలని అభ్యర్థులకు సూచించారు. ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్ పైన దృష్టి సారించడం కోసం ఈ పథకం అందిస్తున్నామని సింగరేణి సిఎండి ఎన్ బలరాం పేర్కొన్నారు. యువత సివిల్ సర్వీసెస్ కలలు సాకారం చేసుకోవడానికి ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ ఇంటర్వ్యూ దశకు చేరిన అభ్యర్థులకు ఆర్థిక భారం లేకుండా చేసేలా, అభ్యర్థులకు ఆర్థికంగా, అకాడమిక్ గా మద్దతునిస్తూ, ఇంటర్వ్యూలు ఫేస్ చేయడానికి సిద్ధం చేసేలా భావించిన ప్రభుత్వం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి ఎంపికైన ప్రతి అభ్యర్థికి రాజీవ్ గాంధీ సివిల్స్ ...