ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ ఎన్‌సీడీ ద్వారా నిధుల సమీకరణ


నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ తాజాగా నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ద్వారా నిధులను సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ఇష్యూ నవంబర్‌ 17న ప్రారంభమవుతుందని సంస్థ సీఎండీ కె.జి. అనిల్‌ కుమార్‌ తెలిపారు. 13 నుంచి 70 నెలల వరకు కాలవ్యవధికి జారీ చేసే ఈ ఎన్‌సీడీలపై రాబడి 10.50 శాతం నుంచి 12.62 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఒక్కో ఎన్‌సీడీ ముఖ విలువ రూ. 1,000గా ఉండగా, కనీస దరఖాస్తు మొత్తం రూ. 10,000గా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు కంపెనీ వినియోగించుకోనుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం