Posts

Showing posts with the label issue will start on November 17

ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ ఎన్‌సీడీ ద్వారా నిధుల సమీకరణ

Image
నాన్‌ -బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ తాజాగా నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ద్వారా నిధులను సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ఇష్యూ నవంబర్‌ 17న ప్రారంభమవుతుందని సంస్థ సీఎండీ కె.జి. అనిల్‌ కుమార్‌ తెలిపారు. 13 నుంచి 70 నెలల వరకు కాలవ్యవధికి జారీ చేసే ఈ ఎన్‌సీడీలపై రాబడి 10.50 శాతం నుంచి 12.62 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఒక్కో ఎన్‌సీడీ ముఖ విలువ రూ. 1,000గా ఉండగా, కనీస దరఖాస్తు మొత్తం రూ. 10,000గా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు కంపెనీ వినియోగించుకోనుంది.