బీహార్‌లో పెద్ద సంఖ్యలో రోడ్డుపై పడేసిన పోల్‌ స్లిప్స్‌ : ఏఆర్‌వో సస్పెండ్


బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో పోల్‌ స్లిప్స్‌ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఒక అధికారిని సస్పెండ్‌ చేశారు. నవంబర్‌ 6న ఆ రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేఎస్‌ఆర్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు పడేశారు. ఈ వీడియో క్లిప్‌ను ఆర్జేడీ షేర్‌ చేసింది. ఈ స్లిప్పులను ఎవరు, ఎప్పుడు, ఎవరి ఆదేశాల మేరకు పడేశారు? అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దోపిడీదారులు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఈసీని నిలదీసింది. అలాగే ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రతను పెంచాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె ఝా కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. మరోవైపు ఈ సంఘటనపై ఈసీ స్పందించింది. పోలింగ్‌కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) పరీక్షించేటప్పుడు మాక్‌ పోలింగ్‌ కోసం వినియోగించిన స్లిప్స్‌ అని తెలిపింది. సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపినట్లు పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్‌వో)ను సస్పెండ్ చేసినట్లు వివరించింది. ఈ సంఘటనపై కేసు కూడా నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం