Posts

Showing posts with the label RJD shared this video clip. Who

బీహార్‌లో పెద్ద సంఖ్యలో రోడ్డుపై పడేసిన పోల్‌ స్లిప్స్‌ : ఏఆర్‌వో సస్పెండ్

Image
బీ హార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో పోల్‌ స్లిప్స్‌ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఒక అధికారిని సస్పెండ్‌ చేశారు. నవంబర్‌ 6న ఆ రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేఎస్‌ఆర్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు పడేశారు. ఈ వీడియో క్లిప్‌ను ఆర్జేడీ షేర్‌ చేసింది. ఈ స్లిప్పులను ఎవరు, ఎప్పుడు, ఎవరి ఆదేశాల మేరకు పడేశారు? అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దోపిడీదారులు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఈసీని నిలదీసింది. అలాగే ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రతను పెంచాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె ఝా కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. మరోవైపు ఈ సంఘటనపై ఈసీ స్పందించింది. పోలింగ్‌కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) పరీక్షించేటప్పుడు మాక్‌ పోలింగ్‌ కోసం వినియోగించిన స్లిప్స్‌ అని తెలిపింది. సమస్తిపూర్ జిల్లా మేజిస్ట...