హైదరాబాద్‌లో దొంగలపై కాల్పులు జరిపిన సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య


హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ పాల్పడుతున్న దొంగలను సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య పట్టుకునేందుకు యత్నించగా డీసీపీపై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. తోపులాటలో డీసీపీ గన్‌మెన్‌ కిందపడిపోయారు. ఈ క్రమంలో గన్‌మెన్‌ నుంచి వెపన్‌ తీసుకుని దొంగలపై డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు కాగా, నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని, డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం