Posts

Showing posts with the label South East DCP Chaitanya opens fire on thieves in Hyderabad

హైదరాబాద్‌లో దొంగలపై కాల్పులు జరిపిన సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య

Image
హై దరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ పాల్పడుతున్న దొంగలను సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య పట్టుకునేందుకు యత్నించగా డీసీపీపై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. తోపులాటలో డీసీపీ గన్‌మెన్‌ కిందపడిపోయారు. ఈ క్రమంలో గన్‌మెన్‌ నుంచి వెపన్‌ తీసుకుని దొంగలపై డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు కాగా, నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని, డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపారు.