తెలంగాణలో జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు!


తెలంగాణలో రైతు భరోసాపై ఈరోజు సచివాలయంలో కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం