Posts

Showing posts with the label జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు

తెలంగాణలో జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు!

Image
తె లంగాణలో రైతు భరోసాపై ఈరోజు సచివాలయంలో కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.