యూట్యూబ్ లో 'ఆటో డబ్బింగ్' ఫీచర్ !
'ఆటో డబ్బింగ్' ఫీచర్ సాయంతో కంటెంట్ క్రియేటర్లు ఇతర భాషల్లోనూ తమ కంటెంట్‌ను ఈజీగా తయారు చేయొచ్చు. ఈ ఫీచర్‌ను వాడుకొని వీడియోలలోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషలోకి మార్చేయొచ్చు. భాషా పరమైన ఇబ్బందులు లేకుండా తమ వీడియోలను ఇతర భాషల్లోకి తర్జుమా చేయొచ్చు. ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషలలోకి ఆటోమేటిక్‌గా డబ్ చేసే అవకాశాన్ని 'ఆటో డబ్బింగ్' ఫీచర్ అందిస్తుంది. ఒకవేళ వీడియోలోని వాయిస్ ఇక్కడ మనం చెప్పుకున్న ఏదైనా ఒక భాషలో ఉన్నా.. ఆటోమెటిక్‌గా ఇంగ్లిష్‌లోకి డబ్బింగ్ అయిపోతుంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ ద్వారా డబ్ చేసిన ఆడియోలపై 'ఆటో డబ్‌డ్' అనే లేబుల్ యూజర్లకు కనిపిస్తుంది. ఒకవేళ కంటెంట్ క్రియేటర్లు డబ్బింగ్ వాయిస్‌ను వద్దు అని భావిస్తే.. ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ద్వారా ఒరిజినల్ వాయిస్‌ను వినొచ్చు. కంటెంట్ క్రియేటర్లు వీడియోను అప్‌లోడ్ చేయగానే యూట్యూబ్ ఆటోమెటిక్‌గా వాయిస్‌ని గుర్తించి సపోర్ట్ చేసే భాషల్లోకి డబ్ చేసేస్తుంది. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్‌లో డబ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోలను కంటెంట్ క్రియేటర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే వీడియోలోని వాయిస్‌ను గుర్తించని సందర్భాల్లో డబ్బింగ్ ఆప్షన్ పనిచేయదు.
Comments
Post a Comment