తెలంగాణలో అరుదైన మూలకాల నిల్వలు గుర్తింపు !
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్లు బయటపడింది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. 15 రకాల లాంథనైడ్స్ తో పాటు స్కాండియం, ఏట్రియంను గుర్తించినట్లు జీఎస్ఐ నివేదిక ఇచ్చింది. దీంతో రాష్ట్ర గనులశాఖ ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
Comments
Post a Comment