మహువా మొయిత్రాపై కేసు నమోదు !
జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు అయింది. ఢిల్లీ పోలీసుల విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ రేఖా శర్మపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు సంబంధించి ఎక్స్ హ్యాండిల్ నుంచి వివరాలను తీసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు. గురువారం, హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ సందర్శించారు. ఆమెకు సంబంధించిన వీడియోలో ఒక వ్యక్తి వెనక గొడుగు పట్టుకుని కనిపిస్తారు. రేఖా శర్మ తన సొంత గొడుగు ఎందుకు పట్టుకోవడం లేదని ఒక యూజర్ ప్రశ్నించిన నేపథ్యంలో, మహువా మొయిత్రా స్పందిస్తూ రేఖా శర్మ తన బాస్ పైజామా పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ కేసుపై మహువా మొయిత్రా మాట్లాడుతూ తాను వెస్ట్ బెంగాల్ నదియాలో ఉన్నానని, రాబోయే మూడు రోజులు ఇక్కడే ఉంటానని, కావాలంటే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తాను తన సొంత గొడుగు పట్టుకోగలనని చెప్పారు.
Comments
Post a Comment