భర్తలను మార్చడంలో ఘనాపాఠీ ఈ మాయలేడీ !


మిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్‌సైట్‌లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. లగ్నకోటి రాసుకొని మరీ దండలు మార్చుకున్నారు. లగ్గమైంది. కాపురం పెట్టారు. పెళ్లయిన మూడు నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో తేడా వచ్చింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యను అదుపులో తీసుకుని విచారిస్తే అసలు యవ్వారం బయటపడింది. ఆమెకు 50 కంటే ఎక్కువ మందితో పెళ్లైందని విచారణలో తేలింది. ఒక డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా ఆమె బాధితుల లిస్ట్‌లో ఉన్నారని తేలింది. సంధ్య ఇప్పటివరకు 39 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఇంత మందిని మోసం చేసిన ఈ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం