డ్రాగన్ ఫ్రూట్ - ఆరోగ్య ప్రయోజనాలు !


డ్రాగన్ ఫ్రూట్ త్వరగా శక్తిని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. వర్షాకాలంలో తినడంవల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను పెంచుతుంది. విటమిన్ B2 (రిబోఫ్లావిన్) కూడా కలిగి ఉన్నందున మొత్తం శరీరానికికే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పొటాషియం ఫుల్లుగా ఉండటంవల్ల రక్తపోటును నియంత్రించడంలో, మెరుగైన గుండె పనితీరుకు దోహదం చేస్తుంది. ఫైబర్ కంటెంట్ ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు మూలం డ్రాగన్ ఫ్రూట్. కాబట్టి ఇది రక్త కణాల డ్యామేజ్‌ను, శరీరంలో నొప్పిని, డీహైడ్రేషన్ వంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. మెగ్నీషియం కంటెంట్ కలిగి ఉన్నందున కండరాలు, నరాలు, ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి హెల్తీ డైట్‌లో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒక్కటి తిన్నా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్తున్నారు. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం