తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల !


తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ వెంకటేశం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్ లో 43.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో పరీక్ష ఫెయిల్ అయిన వారితోపాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం ఈ పరీక్షకు హాజరైన వారు ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

    

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం