Posts

Showing posts with the label సెకండ్ ఇయర్ లో 43.77 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల !

Image
తె లంగాణలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ వెంకటేశం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్ లో 43.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో పరీక్ష ఫెయిల్ అయిన వారితోపాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం ఈ పరీక్షకు హాజరైన వారు ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.