దుబాయ్ లక్కీడ్రాలో నాగేంద్రంకు రూ.2.25 కోట్ల క్యాష్ ప్రైజ్ !
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరుగడ్డ నాగేంద్రం 2017లో యూఏఈ వెళ్లారు. దుబాయ్ లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన దాంట్లో నుంచి ప్రతి నెలా 100 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్‌ను నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ప్రోగ్రామ్ కింద లక్కీ డ్రా తీస్తారు. గ్రాండ్ ప్రైజ్ కేటగిరీలో తీసిన లాటరీలో నాగేంద్రం విజేతగా నిలిచారు. నగదు బహుమతి కింద 1 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. తన పిల్లల ఉన్నత చదువుల కల నెరవేరుతుందని, వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నాగేంద్రం సంతోషపడ్డారు.
Comments
Post a Comment