Posts

Showing posts with the label దుబాయ్‌ లక్కీడ్రాలో నాగేంద్రంకు రూ.2.25 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌

దుబాయ్‌ లక్కీడ్రాలో నాగేంద్రంకు రూ.2.25 కోట్ల క్యాష్‌ ప్రైజ్‌ !

Image
ఆం ధ్రప్రదేశ్‌ కు చెందిన బోరుగడ్డ నాగేంద్రం 2017లో యూఏఈ వెళ్లారు. దుబాయ్‌ లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన దాంట్లో నుంచి ప్రతి నెలా 100 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ను నేషనల్‌ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్‌ కట్టేవారికి రివార్డు ప్రోగ్రామ్‌ కింద లక్కీ డ్రా తీస్తారు. గ్రాండ్‌ ప్రైజ్‌ కేటగిరీలో తీసిన లాటరీలో నాగేంద్రం విజేతగా నిలిచారు. నగదు బహుమతి కింద 1 మిలియన్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. తన పిల్లల ఉన్నత చదువుల కల నెరవేరుతుందని, వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నాగేంద్రం సంతోషపడ్డారు.