జూన్ 10 నుంచి వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ !


యాపిల్ కంపెనీ వార్షిక వరల్డ్ వైడ్  డెవలపర్స్ కాన్ఫరెన్స్ ని ఆన్లైన్లో జూన్ 10 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డెవలపర్లు, స్టూడెంట్స్ ప్రారంభ రోజున యాపిల్ పార్క్ లో జరిగే స్పెషల్ ప్రోగ్రాంలో వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. డెవలపర్స్ అందరికీ ఇది పూర్తిగా ఉచితం. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్ డెవలపర్ యాప్, కంపెనీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చిని పేర్కొంది. WWDC24 తాజా iOS, iPadOS, macOS, watchOS, tvOS, visionOS ల లేటెస్ట్ అప్డేట్స్ ను వెల్లడించే అవకాశం ఉంది. యాపిల్ తీసుకురానున్న సాఫ్ట్ వేర్ అప్డేట్లలో AI ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత జనరేటివ్ AI ఫీచర్ను తీసుకొచ్చేందుకు గూగుల్, బైదూ.. వంటి AI సంస్థలతో పార్టనర్ షిప్ గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ లను పరిచయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఐపాడ్ ఎయిర్, ఓఎల్ఈడీ ఐపాడ్ ప్రోలో కొత్త మోడల్స్ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే. అసలు ఈ ఈవెంట్లో ఏమి ఉంటున్నాయనే దాని గురించి Apple ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. Apple iOS 18 నుండి watchOS 11, VisionOS 2 వంటి అనేక విషయాలను ఆవిష్కరించనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా WWDC కూడా కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో నిర్వహించనున్నారు. Apple ఈ WWDC ఈవెంట్లో సాఫ్ట్వేర్ విభాగంపై మాత్రమే దృష్టి పెడుతుందని తెలుస్తోంది. హార్డ్వేర్ అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహికులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం