10న ఫైర్‌ బోల్ట్‌ డ్రీమ్‌ విడుదల


ఫైర్‌ బోల్ట్‌ డ్రీమ్‌ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది.  ఫైర్ బోల్ట్ నుంచి ఆండ్రాయిడ్‌ 4జీ లైట్‌ నానో సిమ్‌ సపోర్ట్‌ కలిగిన మొట్ట మొదటి రిస్ట్‌ వాచ్‌ ఇదే కావడం విశేషం. జనవరి 10వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఫైర్‌ బోల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ వాచ్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ వాచ్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లతో పాటు గేమింగ్‌ అప్లికేషన్స్‌కు సపోర్ట్ చేస్తుంది.  ఈ వాచ్‌లో 320 x 386 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 2.02 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించారు. డిస్‌ప్లే 600 నిట్‌ల బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాడ్-కోర్ ఆర్మ్ కార్టెక్స్ A7MP SoC ప్రాసెసర్ ఈ వాచ్‌ సొంతం. ఇక ఇందులో 800mAh బ్యాటరీని అందించారు. నాన్‌స్టాప్‌గా ఉపయోగించినా 24 గంటలపాటు పనిచేస్తుంది. ఈ వాచ్‌లో హార్ట్ బీట్ రేట్‌, SpO2, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌తో పాటు పలు రకాల స్పోర్ట్స్ మోడ్‌లు వంటివి ఉన్నాయి. Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ, Google Play Storeకి యాక్సెస్‌ కూడా ఉంది. కేవలం గేమ్స్‌ ఓటీటీ మాత్రమే కాకుండా సోషల్‌ మీడియా సైట్స్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లతో పాటు షాపింగ్‌ యాప్స్‌, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు సైతం ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక స్మార్ట్ ఫోన్‌లాంటి స్మార్ట్‌ వాచ్‌. అలాగే ఈ వాచ్‌లో దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్‌ను ఇచ్చారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం