షావోమి నుంచి మిక్స్‌ ఫోల్డ్‌ 3 ఫోన్ !


షావోమి మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. ఫావోమీ మిక్స్‌ ఫోల్డ్‌ 3 పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఆగస్టు నెలలో లాంచ్‌ చేయనున్నారు. గతంలో షావోమీ నుంచి విడుదల అయిన మిక్స్‌ ఫోల్డ్‌ 2కి అప్‌డేట్‌గా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ధర విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనల రాకపోయినప్పటికీ ముందస్తు నివేదికల ప్రకారం కొన్ని ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఔటర్‌ ప్యానెల్‌, 8.02 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + ఇంటర్నల్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2400 x 1080 పిక్సెల్‌ రెజల్యూజన్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ తో రానుంది.  ఆక్టా కోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ వీ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ మెమొరీని అందించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ఇందులో 120 వాట్స్‌ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 4800 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. https://t.me/offerbazaramzon

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం