ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోల ఎడ్జ్ 30 ప్రో ఫోన్‌పై ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటరోల ఎడ్జ్ 30 ప్రో ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్ లభిస్తోంది. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోల ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ రూ. 55,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ స్మార్ట్‌పోన్‌ను రూ. 34,999కు కొనొచ్చు. అంటే మీరు నేరుగా ఈ ఫోన్2పై 37 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోనపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మీకు ఈ ఫోన్‌పై రూ. 1750 వరకు తగ్గింపు వస్తుంది. అంటే మీరు ఈఫోన్‌ను రూ. 33,249కు కొనొచ్చు. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ స్మార్ట్‌పోన్‌పై ఏకంగా రూ. 30 వేల వరకు డిస్కౌంట్ ఉంది. అంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్ కొంటే మీరు రూ. 4,999 చెల్లిస్తే సరిపోతుంది. తక్కువ ధరకే ప్రీమియం ఫోన్ తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ ఆధారంగా మారుతుంది. అందువల్ల కొన్నింటికీ తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇంకా ఈ ఫోన్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. 1680 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 2200 కట్టాలి. ఇంకా 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3,200 పడుతుంది. 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 4,200 కట్టాలి. 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 6 వేలు పడుతుంది. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. కాగా ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.4 ఇంచుల స్క్రీన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 5జీ వంటి ఫీచర్లు ఉన్నాయి.https://t.me/offerbazaramzon

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం