మార్చి 8 న యాపిల్ ఈవెంట్‌


యాపిల్ ఈవెంట్ మార్చి 8న జరగనుంది. ఈ ఈవెంట్‌లో యాపిల్.. న్యూ మాక్‌బుక్ ప్రో, మాక్‌బుక్ ఎయిర్, మాక్ మినీ, ఐపాడ్ ఎయిర్‌, ఐమాక్ ప్రో (యాపిల్ ఎం1, ఎం2 సిలికాన్‌), ఐఫోన్ ఎస్ 3 ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్చి 8న రాత్రి 11.30కు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. కంపెనీ హెడ్ ఆఫీస్ యాపిల్ పార్క్ నుంచి యాపిల్ టీవీ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈవెంట్ లైవ్‌స్ట్రీమ్ కానుంది. అలాగే.. యాపిల్ అఫిషియల్ యూట్యూబ్ చానెల్‌లోనూ ఈవెంట్‌ను లైవ్ చేయనున్నారు. గత సంవత్సరం రిలీజ్ అయిన మాక్ బుక్ ప్రో లాగానే ఈవెంట్‌లో రిలీజ్ అయ్యే మాక్‌బుక్ ఎయిర్ ఉండనుంది. కాకపోతే ఈసారి కలర్‌ఫుల్ డిజైన్, మిని ఎల్ఈడీ డిస్‌ప్లేతో మాక్‌బుక్ ఎయిర్ రానుంది. చాలామంది ఈ ఈవెంట్ కోసం వెయిట్ చేసేది.. ఐఫోన్ ఎస్ఈ 3 కోసం. దీన్నే ఐఫోన్ ఎస్ఈ (2022)గా పిలుస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ ప్లస్ 5జీ, ఐఫోన్ ఎస్ఈ 5జీ ఫోన్‌గానూ దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. 2020లో రిలీజ్ అయిన ఐఫోన్ ఎస్ఈ 2020 ఫీచర్లతో పాటు.. అదనంగా 5జీ సపోర్ట్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఏ15 బయోనిక్ ఎస్‌వోసీ, బెటర్ రేర్ కెమెరాతో రానున్న ఈ ఫోన్‌ను తక్కువ ధరకే అందించనున్నారు. సుమారు రూ.22,700కే యాపిల్ ఈ ఫోన్‌ను అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో లాంచ్ కాబోయే ఐపాడ్ ఎయిర్ కూడా 5జీ కనెక్టివిటీతో పాటు ఏ15 బయోనిక్ ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో నడవనుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం