రూ. 30 వేల స్మార్ట్‌ టీవీనీ రూ. 7,749కే సొంతం !


ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌పై ఆఫర్లను ప్రకటించింది. మార్చి 12న ప్రారంభమైన ఈ సేల్‌ మార్చి 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్‌లో భాగంగానే రూ. 30 వేలు విలువైన స్మార్ట్‌ టీవీని కేవలం రూ. 7500కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. బ్లౌపంక్ట్ కంపెనీకి చెందిన సైబర్‌ సౌండ్ అనే స్మార్ట్‌ టీవీపై ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది ఫ్లిప్‌ కార్ట్‌. 42 అంగుళాల ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 29,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌ కార్ట్‌ ఈ టీవీపై 33 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో ఈ టీవీ రూ. 19,999కే అందుబాటులో ఉంది. ఇక ఒక వేళ ఈ టీవీని ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అంటే ఈ టీవీని రూ. 18,749కే సొంతం చేసుకోవచ్చన్నమాట. ఈ టీవీపై ఉన్న ఆఫర్లు ఇంతటితో ఆగలేదు. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది. మీ పాత టీవీని ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇచ్చే టీవీకి పూర్తి ఆఫర్ వర్తిస్తే మీరు ఈ కొత్త టీవీని రూ. 7,749కే సొంతం చేసుకోవచ్చన్నమాట. ఈ టీవీలో అన్ని రకాల అధునాతన ఫీచర్లను అందించారు. Blaupunkt Cybersound 106 cm (42 inch) టీవీ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 40 వాట్స్‌తో కూడిన సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చారు. హెచ్‌డీ ఎల్‌ఈడీతో పాటు 1920 x 1080 రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, యూట్యూబ్‌ వంటి అన్ని యాప్‌లను అందించారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం