ఆకాశంలో కనువిందు చేయనున్నబ్లూమూన్


రక్షాబంధన్‌నాడు ఆకాశంలో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఆదివారం రాత్రి బ్లూమూన్ కనిపించనున్నట్లు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించింది. ఒకవేళ ఆదివారం రాత్రి ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే.. అందరూ ఈ బ్లూమూన్ చూడొచ్చు. ఒక సీజన్‌లో సాధారణంగా మూడు పౌర్ణములు ఉంటాయి. అయితే నాలుగు పౌర్ణములు ఉండే సీజన్‌లో వచ్చే మూడో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం.. రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా, మరొకటి సీజనల్‌గా వచ్చే బ్లూమూన్‌.

ఒక కేలండర్ నెలలో రెండు పౌర్ణములు వస్తే.. అందులో రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. ఇక సీజనల్ బ్లూమూన్ అంటే.. ఒక ఆస్ట్రానామికల్ సీజన్‌లో ఒకవేళ నాలుగు పౌర్ణములు వస్తే.. అందులో వచ్చే మూడో పౌర్ణమిని సీజనల్ బ్లూమూన్ అంటారు. 1528లో తొలిసారి ఈ బ్లూమూన్ రికార్డయినట్లు నాసా తెలిపింది. సగటును ఒక ఫుల్ బ్లూమూన్ 2.7 ఏళ్లకు ఒకసారి వస్తుందని స్కై&టెలిస్కోప్ మ్యాగజైన్ వెల్లడించింది. అయితే చంద్రుడు నీలి రంగులో కనిపించడం మాత్రం అత్యంత అరుదుగా జరుగుతుంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా అడవుల్లో కార్చిచ్చు రగిలినప్పుడు భారీ ఎత్తున పొగ, దుమ్ముదూళి వాతావరణంలోకి వెళ్లినప్పుడు చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడు. ఇండియాలో నిండు చంద్రుడిని అర్ధరాత్రి 12 గంటల సమయంలో చూడొచ్చు. తర్వాతి బ్లూమూన్ 2024, ఆగస్ట్‌లో కనిపించనుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం