హెయిర్ కలర్ - జాగ్రత్తలు
హె యిర్ కలర్ వేసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు పాడైపోతుంది. జుట్టు మాత్రమే కాదు స్కిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెయిర్ డై లలో ఉండే రసాయనాలు కొంతమందికి అలర్జీలను లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తాయి. అందుకే హెయిర్ డై వాడేటప్పుడు, వాడడానికి 48 గంటలకు ముందు చెవి వెనుక భాగంలో చేతిపై చిన్న మోతాదులో కలర్ రాయాలి. అక్కడ ఎటువంటి ఇరిటేషన్ , ర్యాష్ రాకపోతే హెయిర్ డై వినియోగించవచ్చు. ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, చర్మం మంటగా ఉండడం, వాపు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆ హెయిర్ కలర్ ను వాడకుండా ఉంటేనే మంచిది. హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు రబ్బర్ లేదా ప్లాస్టిక్ గ్లోవ్స్ ను ఉపయోగించాలి. ఇది మన చేతులపైన రంగు పడకుండా చూడడం మాత్రమే కాకుండా రసాయనాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశంలో కూర్చొని వేసుకోవాలి. ఎందుకంటే హెయిర్ డైలో ఉండే అమోనియా పెరాక్సైడ్ వంటి పదార్థాలు మూసి ఉన్న గదిలో వేసుకుంటే మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. హెయిర్ డైను సూచించిన సమయం కంటే ఎక్కువసేపు దాన్ని ఉంచుకోకూడదు. డై వేసుకున్న తర్వాత ప్య...