Ad Code

హెయిర్ కలర్ - జాగ్రత్తలు


హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు పాడైపోతుంది. జుట్టు మాత్రమే కాదు స్కిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హెయిర్ డై లలో ఉండే రసాయనాలు కొంతమందికి అలర్జీలను లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తాయి. అందుకే హెయిర్ డై వాడేటప్పుడు, వాడడానికి 48 గంటలకు ముందు చెవి వెనుక భాగంలో చేతిపై చిన్న మోతాదులో కలర్ రాయాలి. అక్కడ ఎటువంటి ఇరిటేషన్ , ర్యాష్ రాకపోతే హెయిర్ డై వినియోగించవచ్చు. ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, చర్మం మంటగా ఉండడం, వాపు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆ హెయిర్ కలర్ ను వాడకుండా ఉంటేనే మంచిది. హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు రబ్బర్ లేదా ప్లాస్టిక్ గ్లోవ్స్ ను ఉపయోగించాలి. ఇది మన చేతులపైన రంగు పడకుండా చూడడం మాత్రమే కాకుండా రసాయనాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశంలో కూర్చొని వేసుకోవాలి. ఎందుకంటే హెయిర్ డైలో ఉండే అమోనియా పెరాక్సైడ్ వంటి పదార్థాలు మూసి ఉన్న గదిలో వేసుకుంటే మన ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. హెయిర్ డైను సూచించిన సమయం కంటే ఎక్కువసేపు దాన్ని ఉంచుకోకూడదు. డై వేసుకున్న తర్వాత ప్యాక్ పైన ఇచ్చినటువంటి సమయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సమయానికి జుట్టును కడుక్కోండి. లేదంటే జుట్టు పొడిబారి బలహీనంగా మారుతుంది. డై వేసుకున్న తర్వాత జుట్టును, తల చర్మాన్ని, జుట్టులో మిగిలి ఉన్న కలర్ ను పూర్తిగా తొలగి పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ కండిషనర్ లేదా హెయిర్ సీరం ను జుట్టుకు అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ కలర్ వాడాలి అనుకున్న వారు చర్మ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే వాడాలి. గర్భవతులు కూడా హెయిర్ కలర్స్ వాడాలంటే డాక్టర్లను సంప్రదించాలి. హెయిర్ కలర్ విషయంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు హెయిర్ కలర్ ఎంపిక విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు రసాయన డై లకు బదులుగా, నాచురల్ హెయిర్ కలర్ లను ఉపయోగించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu