Posts

Showing posts with the label victory by 4 wickets

బాక్సింగ్ డే టెస్ట్‌ని కైవశం చేసుకున్న ఇంగ్లాండ్

Image
మె ల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ (బాక్సింగ్‌ డే టెస్ట్‌)లో ఆసీస్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాధారణంగా ఐదు రోజుల పాటు సాగే టెస్ట్‌ మ్యాచ్‌లు అరుదుగా రెండు రోజుల్లోనే ముగుస్తుంటాయి. కానీ ఈ టెస్ట్‌ మాత్రం బౌలర్ల ఆధిపత్యంతో కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ జట్టు దూకుడుగా ఆడింది. 32.2 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగులు చేసి లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ మరియు బెన్‌ డకెట్‌ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. క్రాలీ 48 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేయగా, డకెట్‌ కేవలం 26 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఆసీస్‌ బౌలర్లపై ఒత్తిడిని తెచ్చారు. ఆరంభంలో వికెట్లు పడిన దశలో జాకబ్‌ బె...