Posts

Showing posts with the label thereby preventing the spread of diseases

పశ్చిమ ఆఫ్రికాలో రాబందులు కనుమరుగు : వ్యాధుల వ్యాప్తి ప్రమాదం : పర్యావరణ పరిరక్షణ నిపుణులు హెచ్చరిక

Image
ప శ్చిమ ఆఫ్రికాలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రాబందులు చనిపోయిన జంతువుల కళేబరాలను తినడంతో వ్యాధులు వ్యాప్తి చెందకుండా పర్యావరణాన్ని కాపాడుతాయి. అలాంటి రాబందులు తగ్గిపోవడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వ్యాధుల వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతోందని పర్యావరణ పరిరక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే, సంప్రదాయ విశ్వాసాల పేరుతో వాటిని వేటాడటం, విషప్రయోగం చేయడం, వాటి నివాస ప్రాంతాలను ధ్వంసం చేయడం వంటి కారణాలతో పలు రాబందుల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అయితే నైజీరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న అవ్కా-ఏటీటీ అనే చిన్న పట్టణం మాత్రం ఇందుకు భిన్నమైన ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు రాబందులను పవిత్ర పక్షులుగా భావిస్తూ వాటిని రక్షిస్తున్నారు. అవ్కా-ఏటీటీలో 'న్గుమా' అనే దేవతకు అంకితమైన ఓ పురాతన పుణ్యక్షేత్రం చుట్టూ పవిత్ర అడవి ఉంది. అక్కడ రాబందులు తరతరాలుగా సంచరిస్తున్నాయి. స్థానికుల సంప్రదాయ ఆచారాల్లో భాగంగా రాబందులకు ఆహారం లభిస్తుండటంతో అవి తరచూ ఆలయ పరిసరాలకు చేరుతుంటాయి. అలాగే, చుక్వుమెకా ఇగ్వే అనే స్థానికుడు రాబందుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషితో 'వల్చర్ కిం...