Posts

Showing posts with the label the government will provide rehabilitation and financial security

మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం తరఫున పునరావాసం, ఆర్థిక భరోసా కల్పిస్తాం : డీజీపీ శివధర్ రెడ్డి

Image
అ డవుల్లో కొనసాగుతున్న సాయుధ పోరాటం ఇక ప్రయోజనం లేనిదిగా మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో పోరాటం చేయలేని స్థితి ఏర్పడిందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసరంగా ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని, లొంగిపోతే ప్రభుత్వం తరఫున పునరావాసం, ఆర్థిక భరోసా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా బలహీనపడిందనేందుకు గణాంకాలే సాక్ష్యమని డీజీపీ తెలిపారు. ఒకప్పుడు పీఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మందికి పైగా సభ్యులు ఉండేవారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య కేవలం 66కు మాత్రమే పరిమితమైందన్నారు. ఈ సంఖ్యను బట్టి చూస్తే సాయుధ విభాగం పూర్తిగా క్షీణించినట్టు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తాజా లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ఒకరు మాత్రమే మిగిలి ఉన్నారని వెల్లడించారు. సీఎం పిలుపుతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని డీజీపీ గుర్తు చేశారు. లొంగిపోయే వారి స్థాయి ఆధారంగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. డివిజన్ కమిటీ సభ్యులకు రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, ఇతర సభ్యులకు రూ.1 లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది కేవలం రివార్డు మా...