అల్లుడు కోసం రాజకీయ సన్యాసం ప్రకటించిన అశోక్ సిద్ధార్థ్
మే నల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు బీఎస్పీలో మళ్లీ రాజకీయ అవకాశం కల్పించాలంటే అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని మాయావతి స్పష్టం చేయడంతో, సోషల్ మీడియా వేదికగా అశోక్ సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నట్లు గురువారం సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో ఆగస్టు 2న బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన సిద్ధార్థ్, ఈ పరిణామంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారారు. మాయావతిని తన రాజకీయ గురువుగా, అక్కగా అభివర్ణించిన సిద్ధార్థ్ "ప్రపంచంలో మరేదానికన్నా మీ ఆదేశమే నాకు ముఖ్యం. మీ ఆజ్ఞల ముందు నా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబం కూడా చిన్నవే" అని లేఖలో పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా తనకు లభించిన అవకాశంపై కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశ్ ఆనంద్‌ను తప్పుదోవ పట్టించి పార్టీని నియంత్రించేందుకు యత్నించానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. పార్టీలో తనకు లభించిన ప్రాధాన్యతను చూసి ఓర్వలేక కొందరు సహచరులే తనపై కుట్రలు చేసి తప్పుడు ప్రచారం చేశారని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన ఉద్యమం కోసం త్యాగం: "బహుజన ఉద్...