Posts

Showing posts with the label providing an option to increase the floor height up to 3.3 meters

తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనలలో భారీ మార్పులు

Image
తె లంగాణా ప్రభుత్వం బిల్డర్లు, కొనుగోలుదారుల సమస్యలను పరిష్కరించేందుకు భవన నిర్మాణ నిబంధనలలో భారీ మార్పులు చేస్తుంది. ప్రధానంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని నివారించేందుకు పారదర్శకమైన, సరళీకృత విధానాన్ని తీసుకురానుంది. గతంలో ఉన్న సంక్లిష్టమైన నిబంధనల వల్ల ఓసీలు రాక కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న కరెంట్, నీటి సరఫరా ఇబ్బందులను తొలగించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేందుకు ఇప్పటివరకు అనేక శాఖల నుంచి ఎన్ఓసీలు పొందాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా ఓసీ జారీని మరింత సులభతరం చేయనున్నారు. ముఖ్యంగా చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, నామమాత్రపు జరిమానాలతో అనుమతులు మంజూరు చేసేలా గైడ్‌లైన్స్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే గడువు ముగిసిన అనుమతులు ఉన్న భవనాలకు కూడా ఓసీ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్మాణ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రాజెక్టు భూమిలో 10 శాతాన్ని ప్రభుత్వానికి తనఖా పెట్టే నిబంధనను 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల బి...