పోలీసు డ్యాన్స్ కు జనాలు ఫిదా..!
పోలీసులంటే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ దొంగలమీద జులుం చేసేవారే అనుకుంటాం. జనాలపై అన్యాయంగా దురుసుగా ప్రవర్తించేవారే అనుకుంటాం. కానీ పోలీసుల కరడుకట్టిన ఖాకీ బట్టల వెనుక కూడా మంచి మనస్సు, మానవత్వం, చిలిపితనం, సరదగా వ్యవహరించే తత్వం ఉంటాయి. మానవత్వాన్ని చాటుకున్న ఎంతోమంది పోలీసులు గురించి చూసే ఉంటాం. అలాగే తమ టాలెంట్ తో ఆకట్టుకునే పోలీసులను ఉంటారు. ఈ పోలీసు కానిస్టేబులు అటువంటివారే. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందని నిరూపించారు ఓ కానిస్టేబుల్. ముంబైకు చెందిన అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. 38 ఏళ్ల అమోల్ యశ్వంత్ కాంబ్లే ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2004లో పోలీస్ ఉద్యోగంలో చేరారు. అతనికి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటూ డ్యూటీ పూర్తి అయ్యాక ఖాళీ సమయాల్లో డ్యాన్సులు వేస్తుంటారు. నైగావ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించే కాంబ్లే 'అప్పు రాజా' సినిమాలోని 'ఆయా హై రాజా' సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. కాంబ్లే చేసిన ఈ డ్యాన్స్‌కు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ...