పోలీసులంటే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ దొంగలమీద జులుం చేసేవారే అనుకుంటాం. జనాలపై అన్యాయంగా దురుసుగా ప్రవర్తించేవారే అనుకుంటాం. కానీ పోలీసుల కరడుకట్టిన ఖాకీ బట్టల వెనుక కూడా మంచి మనస్సు, మానవత్వం, చిలిపితనం, సరదగా వ్యవహరించే తత్వం ఉంటాయి. మానవత్వాన్ని చాటుకున్న ఎంతోమంది పోలీసులు గురించి చూసే ఉంటాం. అలాగే తమ టాలెంట్ తో ఆకట్టుకునే పోలీసులను ఉంటారు. ఈ పోలీసు కానిస్టేబులు అటువంటివారే. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందని నిరూపించారు ఓ కానిస్టేబుల్. ముంబైకు చెందిన అమోల్ యశ్వంత్ కాంబ్లే అనే కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. 38 ఏళ్ల అమోల్ యశ్వంత్ కాంబ్లే ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2004లో పోలీస్ ఉద్యోగంలో చేరారు. అతనికి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటూ డ్యూటీ పూర్తి అయ్యాక ఖాళీ సమయాల్లో డ్యాన్సులు వేస్తుంటారు. నైగావ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించే కాంబ్లే 'అప్పు రాజా' సినిమాలోని 'ఆయా హై రాజా' సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. కాంబ్లే చేసిన ఈ డ్యాన్స్‌కు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోలీసు డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తన వీడియో అంత వైలర్ అవుతుందని ఊహించని కాంబ్లే ఈ సందర్భంగా మాట్లాడుతూ వీడియో చేయడం వెనుక సామాజిక కోణం కూడా ఉందని తెలిపారు. డ్యూటీలోఉన్న పోలీసు ఉద్యోగి.. మాస్క్ ధరించని టూ వీలర్ వ్యక్తికి మాస్క్ ధరించమని చెప్పే థీమ్‌తో ఈ డ్యాన్ చేశాం అనీ..ఆ ఉద్ధేశ్యంతోనే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశాం' అని తెలిపారు. మా అన్నయ్య కొరియోగ్రాఫర్. నేను పోలీసు ఉద్యోగంలో చేరడానికి ముందు అతనితో కలిసి కొన్ని డ్యాన్స్ షో లు కూడా చేశానని తెలిపారు. ఒక పోలీసుగా శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను రక్షించడం నా డ్యూటీ. కానీ వీక్లీ ఆఫ్ సమయాల్లో నా పిల్లలు, నా సోదరి పిల్లలతో కలిసి ఇలా డ్యాన్స్ చేస్తుంటాం. అది మాకు చాలా ఇష్టమైన పని అని తెలిపారు. 'ఈ డ్యాన్స్ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ కూడా వస్తోంది. నా డ్యాన్సుల గురించి నెటిజన్లు చేసే కామెంట్స్ చదివితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటివి చదివినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుందని కాంబ్లే తెలిపారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో.. ఆనందానికి కూడా కొంత సమయాన్ని కేటాయించు కోవాలి. లేదంటే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. అందులోను పోలీసు ఉద్యోగం అంటే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిని అధిగమించికపోతే రోజూ డ్యూటీ చేయలేం. డ్యాన్స్ చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. హ్యాపీగా అనిపిస్తుంది అని తెలిపారు.
0 Comments