Posts

Showing posts with the label partially reverse the massive layoffs of federal employees

అమెరికాలో షట్ డౌన్ ఎత్తివేత !

Image
అ మెరికాలో 40 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడింది. దీనికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన బిల్లును సెనెట్ ఆమోదించింది. దీంతో ఫెడరల్ సర్వీసులన్నీ పునరుద్ధరణకు నోచుకోనున్నాయి. ఇప్పటివరకు కలిగిన అంతరాయానికి తెరపడింది. విమాన ప్రయాణాలను స్తంభింపజేసిన షట్‌డౌన్‌ను ముగించడాకి ఉద్దేశించిన బిల్లు ఇది. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ కేపిటల్ వద్ద జరిగిన ఓటు సందర్భంగా పలువురు యూఎస్ సెనెటర్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 30 వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి సవరించిన బిల్లుపై సెనెటర్లు ఓటు వేశారు. ఇందులో మూడు పూర్తి సంవత్సరాల కేటాయింపు బిల్లులు కూడా ఉన్నాయి. ఈ సవరించిన బిల్లు సెనెట్‌ను ఆమోదించింది. తుది ఆమోదం కోసం తిరిగి హౌస్‌కు వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత దీన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పంపిస్తారు. ఈ ప్రక్రియకు ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అమెరికాలో షట్‌డౌన్ 40 రోజులు దాటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ ఒత్తిడి మధ్య ఈ మేరకు ద్వైపాక్షిక బిల్లుకు సెనెట్ ఆమోదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే షట్ డౌన్ కొనసాగితే వచ్...