మోటోరోలా ఎడ్జ్ 2026 స్మార్ట్ ఫోన్ విడుదల
మో టోరోలా ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 2026ను మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ 6.3-ఇంచుల కాంపాక్ట్ డిస్‌ప్లే, సరి కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7450 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మొబైల్, యూజర్లకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఫోన్లు పెద్ద సైజులో వస్తున్న వేళ, మోటోరోలా ఈసారి చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండేలా 6.3-ఇంచుల స్క్రీన్‌ను ఎంచుకుంది. ఇది కేవలం పట్టుకోవడానికే కాదు. వాడుకకు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇది ఒక pOLED డిస్‌ప్లే తో వస్తుంది. ఇందులో 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు లేదా అప్లికేషన్లు వాడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. దీని డిజైన్ విషయానికి వస్తే.. వెనక వైపు ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. మీడియాటెక్ డిమెన్షిటీ 7450 SoC ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. ఈ చిప్‌సెట్ వల్ల మల్టీ టాస్కింగ్, భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లను ఎక్కడా లాగ్ లేకుండా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇది 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవడానికి చాలా బాగ...