మోటోరోలా ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 2026ను మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ 6.3-ఇంచుల కాంపాక్ట్ డిస్‌ప్లే, సరి కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7450 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మొబైల్, యూజర్లకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఫోన్లు పెద్ద సైజులో వస్తున్న వేళ, మోటోరోలా ఈసారి చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండేలా 6.3-ఇంచుల స్క్రీన్‌ను ఎంచుకుంది. ఇది కేవలం పట్టుకోవడానికే కాదు. వాడుకకు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇది ఒక pOLED డిస్‌ప్లే తో వస్తుంది. ఇందులో 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు లేదా అప్లికేషన్లు వాడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. దీని డిజైన్ విషయానికి వస్తే.. వెనక వైపు ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. మీడియాటెక్ డిమెన్షిటీ 7450 SoC ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. ఈ చిప్‌సెట్ వల్ల మల్టీ టాస్కింగ్, భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లను ఎక్కడా లాగ్ లేకుండా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇది 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో బేసిక్ వేరియంట్ 8GB రామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రారంభమవుతుంది. వెనక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో ఇచ్చారు. దీని వల్ల వీడియోలు తీసేటప్పుడు ఫోన్ ఊగినా సరే బ్లర్ అవ్వకుండా క్లియర్ విజువల్స్ వస్తాయి. దీనితో పాటుగా 13MP వైడ్-యాంగిల్ , మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా: రీల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ హై-రెజల్యూషన్ కెమెరాను అమర్చారు. రోజంతా హ్యాపీగా సరిపోయే బ్యాటరీని ఇచ్చారు. అంతేకాదు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. ఆండ్రాయిడ్ అప్‌డేట్‌తో.. కూడిన ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 2026 స్మార్ట్ ఫోన్ విడుదల
June 03, 2026
0
Tags