దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అగ్నిమాపక శాఖకు అందింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్‌ను పంపించారు. మంటలను అదుపు చేయడానికి , లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి మొత్తం 10 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ధికారి తెలిపిన వివరాల ప్రకారం మాలవీయ నగర్‌లోని 'లెమన్ గ్రీన్ రెస్టారెంట్'లో ఈ మంటలు చెలరేగాయి. ప్రాథమికంగా మంటలను అదుపు చేయడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రెండు వాటర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు , ఒక క్విక్ రెస్పాన్స్ వాహనంతో పాటు ఇతర అగ్నిమాపక యూనిట్లను వెంటనే అక్కడికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి రెస్టారెంట్ బిల్డింగ్ బేస్‌మెంట్‌లోకి వెళ్లి, అక్కడ చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం వారిని తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
0 Comments